Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ.. సీతారామం హీరోయిన్ అంటే వెంటనే గుర్తుపడతారు. అందులోని తన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సీతారామం ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది మృణాల్. అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసిన ఈ అమ్మడు సీతారామం మూవీలో ప్రిన్సెస్ నూర్జహాన్ పాత్రకు ప్రాణం పోసింది. ఎంతో మంది హృదయాల్లో సీతగా నిలిచిపోయింది.
ఆ క్రేజ్‌తో ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇటీవల హాయ్ నాన్న (Hi Nanna) మూవీతో మరో బ్లాక్‌బస్టర్ హిట్టును తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రను ఎంపిక చేసుకుని.. మరో సారి తన నటనతో ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మృణాల్(Mrunal Thakur).. ఎప్పటికప్పుడు తనలోని గ్లామర్ ను ఫొటోస్ రూపంలో షేర్ చేస్తూ ఉంటుంది.
( దీనిపై ఓ లుక్కేయండి: రాజమౌళి-మహేశ్ మూవీ.. అందులో నిజం లేదు, అవి పుకార్లు మాత్రమే! )
హాట్ ఫోటో షూట్స్ తో హాట్ హాట్ గా దిగిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి కుర్రకారులను మరింత మత్తెక్కిస్తుంటుంది. సైమా 2023 అవార్డుల కార్యక్రమంలో సీతా రామం మూవీకి గాను మృణాల్ ఉత్తమ నటి విభాగంలో అవార్డులు సొంతం చేసుకుంది. తాజాగా అవార్డ్ ఫంక్షన్‌కు హాజరైన మృణాల్ మరోసారి తన అందాల ఆరబోతుతో కుర్రకారులకు పిచ్చేక్కించింది.
ఫంక్షన్ లో మెరిసిన హాట్ బ్యూటీ
గుజరాత్ లోని గాంధీనగర్ బాలీవుడ్ “69వ ఫిల్మ్ ఫేర్” అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి పలువురికి అవార్డులను ప్రకటించారు. రణబీర్ కపూర్ యానిమల్ (Animal) మూవీకి గాను ఉత్తమ నటుడిగా, అలియా భట్ – ఉత్తమ నటిగా (రాఖీ ఔర్ రాణి), 12th ఫెయిల్ ఉత్తమ చిత్రంగా అవార్డులను సొంతం చేసుకున్నాయి.
వీటిత పాటు వివిధ కేటగిరిలో పలువురు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి కరణ్ జోహార్, ఆయుష్మాన్ ఖురానా, మనీషాపాల్ హోస్ట్ లుగా వ్యవహరించారు. జాన్వికపూర్, వరుణ్ దావత్ తో పాటు.. ఎందరో సెలబ్రిటీలు ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డులకు హాజరయ్యారు. వీరిలో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా కనిపించింది. అవార్డును అందుకోవడానికి వచ్చిన ఈ బ్యూటీ.. హాట్ డ్రెస్ లో కనిపించి అదరహో.. అనిపించింది.
అందాల ఆరబోత
ఫిల్మ్ ఫేర్ అవార్డు వేడుకల్లో పాల్గొన్న మృణాల్ ఠాకూర్ ఫోటోలకు పోజులిస్తూ.. కెమెరాల ముందు సందడి చేసింది. వైట్ డ్రెస్‌లో తన అందాల ఆరబోతతో షో చేస్తూ అందరినీ మంత్రముగ్ధులను చేసింది. వేడుకలో ఎందరో బాలీవుడ్ బ్యూటీస్ పాల్గొన్నప్పటికీ.. వారందరిలోనూ మృణాల్ ఠాగూర్ హైలెట్‌గా నిలిచింది.
ప్రస్తుతం మృణాల్ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ అందాన్ని చూసి చూపు తిప్పుకోలేకపోతున్నామని.. రెండు కళ్ళుచాలడం లేదంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక హాయ్ నాన్న( Hi Nanna) మూవీ సక్సెస్ తరువాత ఈ భామ విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. త్వరలో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.