Ms Dhoni Likely To Play As Opener For Csk Ipl 2024: త్వరలో ఐపీఎల్ 2024 ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని ఆడబోతున్న చివరి సీజన్ ఇదే అయ్యే అవకాశం ఉంది. దీంతో సీఎస్కే ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ధోని అభిమానులు ఈ ఐపీఎల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇటీవల ఫేస్బుక్ వేదికగా ఈ కూల్ కెప్టెన్ చేసిన ఓ పోస్ట్.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీనిపై ప్రముఖ క్రికెట్ అనలిస్ట్, తెలుగు కామెంటేటర్ సీ.వెంకటేశ్ స్పందిస్తూ ధోనీ ఈ సారి ఓపనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
వైరల్‌గా మారిన పోస్ట్
ఐపీఎల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు రెండు నెలలు పాటు దీని హంగామ మామూలుగా ఉండదు. స్టేడియం నిండా ఆడియన్స్, బౌండరీలు బాదే ఆటగాళ్లు, మ్యాచ్‌లో ఊహించని పరిణామాలు.. ఇలాంటి వాటితో క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందిస్తూ వస్తోంది ఈ రిచ్ లీగ్. ఇంకా మ్యాచ్‌లు మొదలు కానే లేదు అప్పుడే దీని హంగామ నెట్టింట మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టన్ మహేంద్ర సింగ్ ధోని పెట్టిన పోస్ట్‌తో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.
అసలు ఏముంది అందులో…
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ‘కొత్త సీజన్.. కొత్త పాత్ర’ కోసం వెయిట్ చేస్తున్నా, దీనికి సంబంధించి త్వరలోనే అప్డేట్ ఉంటుందని ధోని తన ఫేస్ బుక్‌లో ఈ రకంగా పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ వైరల్ కావడం.. ఇక అప్పటి నుంచి అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. చెన్నై జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడా లేదా మరేదైనా ఉందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారా.
My wild guess is, he might open the batting with Ruturaj to make full use of the Power Play overs. Can’t think of any other ‘new’ role for him in a team, for which he’s everything. pic.twitter.com/ZvjDkluKzN
— C.VENKATESH (@C4CRICVENKATESH) March 4, 2024
ఓపనర్‌గా ధోని
ధోని పోస్ట్‌పై తాజాగా ట్విటర్ వేదికగా వెంకటేశ్ స్పందిస్తూ.. ‘నా అంచనా ప్రకారం ధోనీ రుతురాజ్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలో దిగే అవకాశం ఉంది. పొట్టి ఫార్మట్‌లో పవర్ ప్లే ఓవర్లను పూర్తిగా ఉపయోగించుకునే ఆలోచనతో చెన్నై సారథి ఈ వ్యూహం అమలు చేయవచ్చు. అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మరోవైపు సీఎస్కే ఓపెనర్, న్యూజిలాండ్ క్రికెటర్ డెవాన్ కాన్వే గాయంతో ఐపీఎల్ 2024 కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉండగా… ప్రస్తుతం వెంకటేశ్ ట్వీట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.
కాన్వే స్థానంలో రుతురాజ్‌తో కలిసి ఈ కూల్ కెప్టెన్ ఓపెనింగ్ చేస్తే అదిరిపోతుందంటూ క్రికెట్ ప్రేమికులు నెట్టింట రచ్చ లేపుతున్నారు. అయితే కాన్వే స్థానాన్ని భర్తీ చేయగలిగే ఓపెనర్లు చెన్నై జట్టులో ఉన్నారు. వెటరన్ ఆటగాడు అజింక్యా రహానేతో పాటు న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్రను ఓపెనర్‌గా ఆడించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ధోని పెట్టిన పోస్ట్‌కు అంతరార్థం ఏమని తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.