Ooru Peru Bhairavakona Twitter Review in Telugu: యంగ్ హీరో సందీప్ కిషన్ ఎక్కువ ప్రయోగాలు చేస్తూ ఉంటాడని అందరికీ తెలిసిందే. విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను పలకరిస్తుంటాడు. తాజాగా ఈ ప్రయోగాల్లో భాగంగా ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ మూవీకి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సింది.
అయితే పలు కారణాల వల్ల వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. ఈ మూవీ మీద నమ్మకంతో విడుదలకు రెండు రోజుల ముందు ఫిబ్రవరి 14న పెయిడ్ ప్రీమియర్స్‌తో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది చిత్ర యూనిట్. ప్రీమియర్స్ షోలు నుంచి పాజిటివ్ స్పందన అందుకుంది. దీంతో పాటు చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ ఓ రేంజ్లో చేసుకుంటూ పోయింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది ఊరు పేరు భైరవకోన(Ooru Peru Bhairavakona).
((దీనిపై ఓ లుక్కేయండి: కొత్త లుక్‌లో ప్రిన్స్.. పూనకాలు గ్యారెంటీ అంటున్న ఫ్యాన్స్!))
ఇప్పటికే ప్రీమియర్స్ షో ద్వారా మంచి స్పందన అందుకున్న ఈ మూవీ థియేటర్లలో ఆడియన్స్‌ని ఎంత మేర మెప్పించిందో ఓ లుక్కేద్దాం. ఇక ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అసలు ఊరు పేరు భైరవకోన ఎలా ఉంది? సందీప్ కిషన్ ఈ సినిమాతో తన ఖాతాలో హిట్ వేసుకున్నాడా వంటి తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘తెలుగున్యూస్నౌ’ బాధ్యత వహించదు.
ఇది నా జెన్యూన్ రివ్యూ.. ఊరు పేరుభైరవకోన మూవీలో కామెడీ, స్క్రీన్‌ప్లే, వీఎఫ్ఎక్స్ VFXతో ఫస్ట్ హాఫ్ ఆడియన్స్ బాగా ఆకట్టుకునేలా సినిమా ప్రారంభమవుతుంది. సెకండ్ హాఫ్ కొంత ఎమోషనల్ కనెక్ట్‌తో కాస్త మెరుగ్గా ఉండాల్సింది. పాటలు + యాక్షన్ ఎపిసోడ్స్ మూవీ ఎంగేజింగ్ చేయడంలో చాలా బాగా పనిచేశాయి. హీరో సందీప్ కిషన్ మూవీ కోసం తన వంతు కృషి చేసాడని…ఓ నెటిజన్ ఇలా రాసుకొచ్చాడు
My genuine review on #OoruPeruBhairavakona
Movie started so well engaging first half with good comedy, screenplay and VFX
Second half could be better with some emotional connect…but have it highs. songs + action episodes worked so well @sundeepkishan anna did his best👍
— Rogers (@CEORiShikumar4) February 15, 2024
ఓ నెటిజన్ ఇలా రాసుకొచ్చాడు.. సినిమా చూసి మంచి థ్రిల్‌గా ఫీలయ్యాను.. అన్ని అంశాలు కలగలిపి ఈ మూవీ తీశారు.. అయితే కొన్ని రివ్యూలు మాత్రం ఇలా ఎందుకు ఇస్తున్నారో తెలియడం లేదు.. సందీప్ కిషన్ అద్భుతంగా నటించాడు.. హీరోయిన్లు కూడా పాత్రల్లో బాగానే నటించారు.. వీఐ ఆనంద్ ఓ జెమ్.. యూనిక్ స్టోరీ తీసుకుని.. దానిని చెప్పిన విధానం బాగుందని మెచ్చుకున్నాడు ఓ నెటిజన్.
#OoruPeruBhairavaKona
3.25/5
Good triller with all elements
Dont know why reviews are about this@sundeepkishan nails every bit especially in emotional scenes
Heroines are good in their role
And #VIAnand is jem for these unique story tellings and direction
— Richi (@ruthvikrichi007) February 15, 2024
దర్శకుడు వీఐ ఆనంద్ మంచి ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీలో కొన్ని ప్లస్, మైనస్‌లు ఉన్నాయి. ఫస్టాఫ్‌లో నేరేషన్ కాస్త కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ.. ఆ సందేహాలకు సెకండాఫ్‌లో బాగా కనెక్ట్ చేసి క్లారిటీ ఇచ్చాడు.
క్లైమాక్స్ ఇంకాస్త బెటర్‌గా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఓవరాల్‌గా ఊరుపేరుభైరవకోన మూవీ ఓసారి చూడొచ్చని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
Director VI Anand came up with an ambitious film that has its share of pros and cons. The narrative is a bit confusing in the first half, but it gets settled in the latter half as it connects the dots well. The ending part and a few key moments could have… pic.twitter.com/PqraAywVi3
— Review Rowdies (@review_rowdies) February 14, 2024