OTT: విలక్షణ నటిగా గుర్తింపు పొందిన ప్రియమణి ప్రధాన పాత్రలో హీరోయిన్ ఓరియెంటెడ్ తెరకెక్కిన సినిమా భామాకలాపం. 2002లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా భామాకలాపం-2తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రియమణి.
((దీనిపై ఓ లుక్కేయండి: కొత్త లుక్‌లో ప్రిన్స్.. పూనకాలు గ్యారెంటీ అంటున్న ఫ్యాన్స్!))
నేరుగా ఓటీటీ (OTT)ప్లాట్ ఫామ్ లోకి వచ్చిన భామాకలాపం 2 మూవీకి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఫస్ట్ పార్ట్ ను మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయా? అందుకే ఈ రేంజ్లో స్పందన వస్తోందా? ప్రియమణి ఈసారి ఎలాంటి సాహసం చేసింది. మూవీ ఎలా ఉందంటే..
24 గంటల్లోనే 50 మిలియన్లకు పైగా..
అందాల భామ ప్రియమణి నటించిన ‘భామాకలాపం-2’ ఫిబ్రవరి 16న నేరుగా ఓటీటీ లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి ఓటీటీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం ఓటీటీలోకి విడుదలైన 24 గంటల్లోనే ‘భామాకలాపం-2’ 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్క్‌ను దాటేసింది. ఈ విషయాన్ని ఆహా ట్విట్ చేసింది.
క్రైమ్ ఈస్ట్ థ్రిల్లర్ గా..
మొదటి భాగం పూర్తయిన దగ్గర నుంచే రెండో భాగం స్టార్ట్ అవుతుంది. ఇక అనుపమ యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో “అనుపమగుమగుమ” అనే రెస్టారెంట్‌ను ప్రారంభిస్తుంది. కుకింగ్ ఐడల్ 2023లో సెన్సేషన్ లెవెల్ కుకింగ్ కాంపిటీషన్‌కు అనుపమ అప్లై చేస్తుంది. మరోవైపు ఆంథోనీ లోబో (అనూజ్ గుర్వారా) అనే బిజినెస్ మ్యాన్ కుకింగ్ ఐడల్ ట్రోఫీ అనే పేరుతో యూరప్ నుంచి డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ చేస్తాడు. అలాగే తనను హీరోయిన్ చేస్తాడని ఆశతో జుబేదా (సిరత్ కపూర్) ఐదు సంవత్సరాలుగా ఆంథోనీ లోబోతో ఉంటూ వస్తుంది.
ఈ డ్రగ్స్‌ను కొట్టేయాల్సిన పరిస్థితి అనుపమకు ఎందుకు వస్తుంది? ఈ దొంగతనం ఎవరి జీవితాలను మార్చింది? అనేది తెలియాలంటే ఈ హెయిస్ట్ థ్రిల్లర్ ను చూడాల్సిందే. మొదటి భాగంలో కోడిగుడ్డు చుట్టూ అల్లుకున్న స్టోరీని, రెండో భాగంలో కోడిపుంజు బొమ్మను చుట్టూ తిప్పారు. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే భామాకలాపం 3 కూడా ఉంటుందంటూ మూవీ క్లైమాక్స్ లో మరో ఇంటరెస్టింగ్ క్రియేట్ చేశారు మేకర్స్. దీన్నిబట్టి భామాకలాపం మూడు కూడా వచ్చేస్తుందన్నమాట. ఇక ఏదేమైనా వీకెండ్ లో ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి మంచి క్రైమ్ హీస్ట్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి భామాకలాపం 2 మంచి టైం పాస్ అవుతుందనే చెప్పాలి.