Prabhas Dupe Kiran Raj Remuneration: బాహుబలి సినిమా.. ఈ మూవీ మొదలు పెట్టినప్పుడు నటులుగా మొదలైన వారి ప్రయాణం.. విడుదల అనంతరం అందులోని వారిని స్టార్లను చేసింది. కేవలం నటులు మాత్రమే కాదు అందులోని సాంకేతిక నిపుణులకు కూడా మంచి గుర్తింపుని సంపాదించి పెట్టింది ఈ సినిమా.
((దీనిపై ఓ లుక్కేయండి: సామ్ విడాకులకు కారణం ఈ అమ్మాయేనా?.. నెట్టింట రచ్చ చేస్తున్న పోస్ట్!))
ఈ జాబితాలోనే బాహుబలిలో ప్రభాస్‌కు డూప్‌గా నటించిన కిరణ్ రాజ్ కూడా ఉన్నాడు. ప్రభాస్‌తో దిగిన ఒక్క ఫోటోతో ఇతనికి సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుతం డూప్‌గా నటిస్తున్న కిరణ్ రాజ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్‌పై నెట్టింట్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది.
రెమ్యునరేషన్ వైరల్
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కటౌట్ చూస్తే చాలు అభిమానులు ఆనందంతో ఊగిపోతారు. తమ హీరో డాన్స్, డైలాగులు, ఫైట్స్ చేస్తుంటే పూనకాలతో ఊగిపోవాల్సిందే. ముఖ్యంగా కొన్ని సినిమాలో పోరాటాలకు సంబంధించిన సన్నివేశాలు కొన్ని ప్రమాదకరంగా రూపొందిస్తుంటారు. కాస్త రిస్క్ అయినా సరే కథ డిమాండ్ చేస్తే దర్శకులు వాటిని తెరకెక్కిస్తుంటారు.
అయితే ఇలాంటి ప్రమాదకర సీన్లను చాలా వరకు హీరోల డూప్లతో చేయిస్తుంటారు. ఇక ప్రభాస్ విషయానికొస్తే బాహుబలి మూవీ చిత్రీకరణ సమయంలో తనకు డూప్‌గా చేసిన వ్యక్తితో ఫోటో దిగిన సంగతి తెలిసిందే. ఇక అప్పుడు ఆ ఫోటో విపరీతంగా వైరల్‌గా కూడా మారింది. అయితే తాజాగా కిరణ్ రాజ్ గురించి ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
బాహుబలితోనే అంత క్రేజ్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ డూప్ కు చెల్లించే రెమ్యునరేషన్ గురించి ఓ రేంజ్ లో చర్చ జరుగుతుంది. మొదట్లో కిరణ్ రాజ్ అంటే ఎవరికి అంతగా పరిచయం లేదు. కానీ బాహుబలి సినిమాతో ఒకసారిగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఇతను.. గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో కూడా పాల్గొన్నాడు. సాధారణంగా హీరోల డూప్‌లకు ఆ సినిమా నిర్మాతలే రెమ్యూనరేషన్ ఇస్తుంటారు. కానీ ప్రభాస్ తన వద్ద పనిచేసే ప్రతి ఒక్కరికి సొంతంగా జీతాలు ఇస్తుంటారని టాక్.
ఇక తన డూప్‌గా చేస్తున్న కిరణ్ రాజ్‌కు కూడా డార్లింగ్ డబ్బులు చెల్లిస్తాడని.. ఈ క్రమంలో అతనికి ఒక్కో సినిమాకు దాదాపు 30 లక్షల వరకు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీని చూసిన నెటిజన్లు.. ఒక్కో సినిమాకు అంత పెద్ద మొత్తంలో చెల్లిస్తుండడంతో ప్రభాస్ పై పలువులు ప్రశంసల జల్లు కురిపిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా కిరణ్ రెమ్యూనరేషన్ విన్న పలువురు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. కేవలం డూప్ గానే నటిస్తూ ఈ రేంజ్లో రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదంటూ నేటిజెన్లు షాక్ అవుతున్నారు. ఇదంతా పక్కనపెడితే ఈ విషయంలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.