Prabhas Reveals Marriage Rumour: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే వినిపించే మొదటి పేరు రెబెల్ స్టార్ ప్రభాస్. డార్లింగ్ పెళ్లి గురించి నిత్యం ఏదోక వార్త నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉంటుంది. ఇటు సినిమా ఈవెంట్లో, అటు ఇంటర్వ్యూలకి హాజరైనప్పుడు ..ఏదో ఒక సందర్భంలో ప్రభాస్ కి ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. అంతేనా ఓ పక్క డార్లింగ్ ఫ్యాన్స్..మరో పక్క సినీ ప్రముఖులు సైతం ఈ వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి లేటెస్ట్ లీక్.. ఫ్యాన్స్కి పూనకాలు గ్యారెంటీ!
అయితే మన బాహుబలి నుంచి మాత్రం పెళ్లి టాపిక్ పై ఎటువంటి కామెంట్స్ చేయలేదు. కానీ బుజ్జి పరిచయం చేసే ఈవెంట్ లో మొదటిసారి తన పెళ్లి గురించి ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ప్రభాస్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారి రచ్చ చేస్తున్నాయి.
ఈవెంట్లో అందరికీ షాక్
రెబెల్ స్టార్ ప్రభాస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన కల్కి 2898 ఏడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ ఈ మూవీ నీ హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అంతే కాకుండా ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయనే చెప్పాలి. భారీ అంచనాలతో ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్ ముందు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్లను మొదలు పెట్టింది.
అందులో భాగంగా మే 22న రామెజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహించి… ఈ కార్యక్రమంలో మూవీలో భైరవ కి ఎంతో ముఖ్యమైన బుజ్జి అనే వాహనాన్ని ప్రేక్షకులకి పరిచయం చేశారు. ఏ ఈవెంట్ అయిన, మూవీ ప్రమోషన్స్ అయిన మన డార్లింగ్ అంతగా మాట్లాడడు అనే విషయం తెలిసిందే. అయితే నిన్న మాత్రం చాలా ఎక్కువ సమయం స్పీచ్ ఇచ్చి తన ఫ్యాన్స్ తో పాటు అక్కడున్న వారందరికీ షాక్ ఇచ్చాడని చెప్పాలి. ఇక తమ అభిమాన హీరో అలా మాట్లాడుతూ ఉండేసరికి అక్కడున్న డార్లింగ్ ఫ్యాన్స్ అలా చూస్తూ ఉండిపోయారు.
అందుకే పెళ్లి చేసుకోలేదు.. ((Prabhas Reveals Marriage Rumour))
ఈవెంట్ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. “హాయ్ డార్లింగ్స్. ఈ రకంగా చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి మీ భద్రతా కోసమే. సారీ డార్లింగ్స్. అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతలో యాంకర్ సుమ అక్కడకి వచ్చి..రీసెంట్గా మీరు మీ జీవితంలోకి ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారంటూ నెట్టింట చేసిన పోస్ట్ హల్ చల్ కావడం …అధి చూసిన అమ్మాయి హృదయాలు ముక్కలయ్యాయి అని దీనిపై వివరణ అడగగా… ఆ అమ్మాయిల కోసమే ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటూ ప్రభాస్ తన పెళ్లి పై సరదాగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.