Pragya Jaiswal Bridal Vibes Dress: మిర్చి లాంటి కుర్రాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రగ్యా జైశ్వాల్.. తన తొలి సినిమా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
ఇక క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె మూవీలో తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన అవి ఈ అమ్మడు కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. ‘అఖండ’ మూవీలో బాలయ్యకు జోడిగా నటించి మరో సారి తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవడంతో పాటు కాస్త క్రేజ్ కూడా సంపాదించుకుంది.
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ – జాకీ భగ్నానీ పెళ్లికి వెళ్లిన ప్రగ్యా.. ప్రత్యేక డ్రెస్‌తో అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ఆ డ్రెస్‌తో తనకు నచ్చినట్లు ఫోటోషూట్‌కి ఫోజులిచ్చింది.
అఖండ్ మూవీ ఇచ్చిన జోష్‌తో ముందుకు వెళ్లిన ఈ భామకు సన్ ఆఫ్ ఇండియా అంతగా కలిసి రాలేదు. దీంతో తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నట్లు ప్రకటించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తూ వరుస పోస్టులు పెడుతూ తన ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా అదిరిపోయే లుక్ లో మెరిసింది.
(( దీనిపై ఓ లుక్కేయండి:: Janhvi Kapoor: కూల్ లుక్‌తో కైపెక్కిస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్ ))
Source: Twitter