టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీభగ్నానితో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. గోవాలో జరిగిన వీరి డెస్టినేషన్ వెడ్డింగ్‌కు బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు కూడా. అయితే పెళ్లయ్యాక వీరి వివాహ జీవితం ఎలా ఉండబోతుంది? అనే విషయాలపై ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గతంలో చెప్పిన కొన్ని విషయాలు తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన ఏం చెప్పాడంటే..
(( దీనిపై ఓ లుక్కేయండి:: ప్రభాస్ డూప్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎంతో తెలుసా? ))
వారిద్దరికీ కుదరదు
ఇండస్ట్రీలో సెలబ్రిటీల గురించి వార్తలు రావడం సహజం. కొన్నిసార్లు మాత్రం కొందరు చెప్పేవి ఇట్టే నమ్మేస్తుంటాం. సెలబ్రిటీస్ జీవితం ఎలా ఉంటుంది? పెళ్లి- వివాహబంధం ఎలా ఉండబోతుందో అనే విషయాల పై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గతంలో చెప్పిన విషయాలు మాత్రం విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో ఆయన చెప్పిన జాతకాలు నిజమే అంటూ.. కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
అంతేనా సినీ ఇండస్ట్రీ నుంచి ఆయనతో పూజలు కూడా చేయించుకున్న వారున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ వివాహ బంధం అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో రకుల్ గురించి చెప్పినవి తాజాగా వైరల్ అవుతున్నాయి.
పెళ్లి జరిగినా కూడా విడిపోతారు
ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి ఏదో విషయంగా మాట్లాడుతూ.. రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రస్తావించారు. రకుల్ ప్రీత్ సింగ్, తన ప్రియుడి జాతక రిత్యా వారివురికి సరిగా లేదని.. ఒక వేళ నిశ్చితార్థం జరిగినా పెళ్లి రద్దు చేసుకుంటే మంచిదని.. లేదంటే ఇబ్బందులు వస్తాయని వేణు స్వామి సూచించారు. ఆయన చెప్పిన విధంగానే రకుల్ ప్రీత్ సింగ్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సినీ కెరియర్ కాస్త డౌన్ అయింది.
అంతేకాకుండా ఒకవేళ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి జరిగినా కూడా.. తర్వాత విడిపోయే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వీటితో పాటు వారు కుటుంబ విషయాలపరంగా రకుల్ ప్రీత్ సింగ్ సంతోషంగా ఉండలేరని చెప్పారు. ఇవే కాక సంతానం కలగకపోవడం సహా న్యాయ పరమైన ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నట్లు చెప్పారు. వీటితో పాటు రకుల్ ఓ కేసు విషయమై జైలు కెళ్లే అవకాశం కూడా ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
అప్పట్లో వేణు స్వామి చెప్పింది నిజమైంది
ఏదేమైనా గతంలో సమంత, నాగచైతన్య వివాహానికి సంబంధించి వేణు స్వామి చెప్పింది నిజమైంది. భార్యాభర్తలుగా ఇక కొనసాగలేమంటూ చై- సామ్ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. మరి రకుల్ విషయంలో వేణు స్వామి చెప్పింది జరుగుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సి ఉంది.