Samantha Shares Swimsuit Photoss: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. మయోసైటిస్ కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సామ్ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటోంది.
ఎప్పటికప్పుడు తన హెల్త్, మూవీస్ గురించి అప్డేట్ ఇస్తూ అభిమానులను పలకరిస్తూనే ఉంది. అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తూ సమంత ఫోటోషూట్లు.. ఆమె ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తున్నాయి. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట సంచలనాలు సృష్టిస్తోంది. ఇంతకీ ప్రస్తుతం సామ్ ఎక్కడ ఉందంటే..
((దీనిపై ఓ లుక్కేయండి: సామ్ విడాకులకు కారణం ఈ అమ్మాయేనా?.. నెట్టింట రచ్చ చేస్తున్న పోస్ట్!))
సినిమాలు కాదు.. వాటి మీద ఫోకస్…
గతంలో కెరీర్ పరంగా ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోయిన సామ్ ఈ మధ్యకాలంలో మాత్రం సినిమాల వేగాన్ని తగ్గించేసింది. గత ఏడాదిలో శకుంతల, ఖుషితో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించని ఫలితాలను అందుకోలేకపోయాయి. ఇప్పుడైతే తన ఆరోగ్య దృష్ట్యా…. ఆమె ఒక్క మూవీని కూడా చేయట్లేదని సమాచారం. కానీ సీటాడెల్ అనే వెబ్ సిరీస్ లో మాత్రం నటించింది. ఇది మరి కొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్ కాబోతుంది. దీనికోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
కొంతకాలంగా బిజీ బిజీ షెడ్యూల్ అంటూ సినిమాలు కాకుండా ఆధ్యాత్మిక యాత్రలతో పాటు జీవితాన్ని ఉల్లాసంగా గడిపేందుకు ప్రాధాన్యమిస్తుంది సమంత. కేవలం తన హెల్త్ మీదే శ్రద్ధ తీసుకుంటోంది. శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టం మీద ప్రభావం చూపించే ఈ వ్యాధి నుండి కోలుకునేందుకు చికిత్స తీసుకుంటోంది. ప్రస్తుతం హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తూ, ప్రకృతికి దగ్గరగా మనసు ప్రశాంతంగా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది.
సోషల్ మీడియా షేక్
ఈ క్రమంలోనే మలేసియాకు వెళ్ళిన సమంత అక్కడ ఓ రిసార్ట్‌లో దిగింది. చిన్న పాండ్ లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ బికినీతో స్నానం చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ ఫోటోలను 10 మిలియిన్స్ పైగా చూడగా, సుమారు 25 లక్షల వరకు లైక్స్‌తో నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
సామ్ కొలనులో ఈత కొడుతున్న దృశ్యాలు, కుర్రకు కుర్రకారుకు మతిపోగొట్టినంత పనిచేస్తున్నాయి. ప్రకృతిని చూస్తూ పరవశిస్తున్న ఈ భామను బికినీలో చూసి ఫ్యాన్స్ పులకరించిపోతూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఇంత హాట్ గా ఉన్నావ్ ఏంటి సామ్ అంటూ కొందరు.. ఓరి దేవుడా ఇంత ఘాటుగానా అంటూ మరికొందరు స్పందిస్తున్నారు.
View this post on Instagram