Save The Tigers Season 2: ఫిల్మ్ మేకర్ మహి వి.రాఘవ్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రస్తుతం ఈ వెబ్ షో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఫస్ట్ వీక్‌లోనే వ్యూయర్ షిప్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 1 బ్లాక్ బస్టర్, తర్వాత ‘సైతాన్’ సూపర్ హిట్ కాగా తాజాగా ‘సేవ ది టైగర్స్’ సీజన్ 2 బ్లాక్ బస్టర్ అయ్యాయి.
((దీనిపై ఓ లుక్కేయండి: విడాకుల తర్వాత మొదటిసారి స్టేజి మీద చై-సామ్!))
ఈ క్రమంలో వరుసగా మూడు హిట్లు అందుకున్న డైరెక్టర్ మహి వి.రాఘవ్ టాలీవుడ్లో అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్నారు. మహి తన త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూనే షో రన్నర్‌గా వెబ్ సిరీస్‌లను కూడా రూపొందిస్తూ మంచి విజయాలని అందించారు.తాజాగా ఆయన తెరకెక్కించిన ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 వెబ్‌సీరీస్ (Save The Tigers Season 2)అద్భత విజయాన్నిఅందుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు.
చుట్టూ జరిగే కథలే
అనంతరం మహి మాట్లాడుతూ.. ‘‘ఇంత మంచి సక్సెస్‌ను అందించిన ఆడియన్స్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రోజూ మన చూట్టూ జరిగే సరదా సన్నివేశాలు, జంటల మధ్య సాగే సంభాషణలు, వాటితో పాటు వారి మధ్య జరిగే బలమైన ఎమోషన్స్ ను సన్నివేశాలను ప్రధానంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. దీనికి తోడు ఇందులోని నటీనటులు కూడా అద్భుతంగా నటించారు. ఫైనల్‌గా మేం అనుకున్నట్లుగా వినోదాన్ని ప్రేక్షకులకు అందివ్వగలిగాం. మన మూలాలకు సంబంధించిన స్టోరీలను తెరపై చూపే ప్రయత్నం చేస్తాను. అందుకే ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిందని’ అన్నారు
ఒత్తిడి ఫీలయ్యా
సేవ్ ది టైగర్స్ సీజన్ 1లో ఫ్రస్టేషన్‌తో భాధపడుతున్న భర్తలు ఎలా ప్రవర్తిస్తారనే దాన్ని తెరకెక్కిస్తే, సీజన్ 2లో వారి బాధ్యతలు, మానసిక పరిపకత్వలను ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. ఇది ప్రేక్షకులకు నచ్చడంతో సేవ్ ది టైగర్స్ సీజన్ 1 ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ విజయంతో సీజన్ 2పై తెరకెక్కించేటప్పుడు కాస్త ఒత్తిడిగా కూడా ఫీలయ్యాను. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్‌ను చేయాలనుకున్నప్పుడు చమత్కారంతో కూడిన రచన అనేది ఎంతో అవసరం.
మా త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై కొత్త రచయితలను, డైరెక్టర్లను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుంటాం. ఈ బ్యానర్లో సినిమాలను, వెబ్ సిరీస్‌లను కూడా నిర్మిస్తున్నాం. మా బ్యానర్‌కు సినీ పరిశ్రమలో గుర్తింపు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన కథలను అందించటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. త్వరలోనే ఆడియన్స్ నచ్చే విధంగా మరికొన్ని వెబ్ షోలను రూపొందించటానికి సిద్ధంగా ఉన్నామని మహి.వి.రాఘవ్. అన్నారు