Sreeleela: చిత్ర పరిశ్రమ ఇదొక రంగుల ప్రపంచమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ నిలదొక్కుకోవాలి అంటే చాలా కష్టం. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సరైన సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకోకపోయినా ఇండస్ట్రీ మనల్ని పక్కన పెట్టేస్తుంది. ఇక ప్రత్యేకంగా ఇందులో హీరోయిన్ల గురించి చెప్పక్కర్లేదు. గ్లామర్ గా ఉండాలి, పర్ఫామెన్స్ తో పిచ్చెక్కించాలి, స్టెప్పులు ఇరగదీయాలి. అంతటితో అయిపోలేదు.. తాము నటించిన సినిమాలు హిట్లు కూడా కావాలి.
అప్పుడే కెరీర్ గ్రాఫ్ టాప్ కి చేరుతుంది, లేదంటే రేసు నుంచి మధ్యలోనే పక్కకు తప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్లో తాజా సంచలనం కన్నడ బ్యూటీ శ్రీలల పరిస్థితి ఈ తరహాకే చెందుతుంది. అమ్మడుకు ఎంత టాలెంట్ ఉన్నా రొటీన్ కథలతో తన కెరీర్ ని డామేజ్ చేసుకుంటుందనే వాదన వినిపిస్తోంది.
ఆరంభం అదిరింది.. కానీ
శ్రీ లీల పెళ్లి సందడితో తెలుగులో ఆరంగ్రేటం చేసినా మాస్ మహారాజా రవితేజ్ ధమాకా తో ఫస్ట్ బిగ్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో అమ్మడు బ్యూటీ తో పాటు డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఆ తర్వాత ఈ భామ చేతినిండా సినిమాలతో బీజీ అయిపోయింది. ఆ జాబితాలో స్కంద, భగవత్ కేసరి ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఆది కేశవ సినిమాలు చేసింది. అయితే భగవత్ కేసరి సూపర్ హిట్ అయిన ఆ క్రెడిట్ బాలయ్య అకౌంట్లో పడింది. మిగిలిన సినిమాలు అన్నీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో శ్రీ లీలకు ఆ సినిమాల నుంచి నిరాశ ఎదురైంది. ఇటీవల వచ్చిన గుంటూరు కారం మూవీ కూడా మిక్సిడ్ టాక్ అందుకున్నప్పటికీ వసూళ్లు బాగానే వస్తున్నాయి. ఈ సినిమాలో దర్శకుడు శ్రీ లీల డాన్సులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
తీరు మారాల్సిందే
కేవలం డ్యాన్సులను కాక శ్రీలీల ఇకపై కథలపై కాస్త శ్రధ్ద పెట్టాల్సి ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. లేదంటే కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు. గతంలో టాప్ ప్లేస్‌కి చేరుకున్న హీరోయిన్లు తమ కెరీర్లో పర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలో పడ్డాయి అందుకే వాళ్ళ కెరీర్ గ్రా ఫ్ టాప్ కి చేరింది.
కానీ శ్రీ లీలకు అలాంటి బ్రేక్ ఇంకా దక్కలేదనే చెప్పాలి. అంతేకాకుండా ఇదే రీతిలో వరుస పెట్టి సినిమాలు చేసి.. అవి ఫ్లాప్‌లు కావడంతో మూవీ ఆఫర్లు రాక కొందరు, కెరీర్ నెమ్మదించి మరి కొందరు హీరోయిన్లను మనం ఇది వరకే చూశాం. కనుక ఇకపై వచ్చే కథల విషయంలో కన్నడ బ్యూటీ జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది, మరి శ్రీలీల ఎలా ఈ డేంజర్ జోన్ నుంచి బయటపడుతుందో చూడాలి.