Suhas Remuneration: యూట్యూబ్ నుంచి సినీ రంగంలోకి వచ్చి.. అందివచ్చిన చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు సుహాస్. అయితే టాలెంట్ ఉంటే ఎప్పటికైనా గుర్తింపు వస్తుందనే విషయాన్ని నిరూపిస్తూ చిన్న స్థాయి ఆర్టిస్ట్ నుంచి హీరో రేంజ్‌కు ఎదిగిపోయాడు. ఇటీవల విడుదలైన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీతో ప్రేక్షకులను అలరించి మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం ‘ప్రసన్నవదనం’ అనే సినిమా చేస్తున్న సుహాస్.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర ప్రశ్నలకు బదులిచ్చాడు.
(( దీనిపై ఓ లుక్కేయండి:: ప్రభాస్ డూప్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎంతో తెలుసా? ))
అలా మొదలైన కెరీర్
జూనియర్ ఆర్టిస్ట్‌గా జీవితాన్ని మొదలు పెట్టిన సుహాస్ ఇప్పుడు హీరోగా తన సత్తా చాటుతున్నాడు. కలర్ ఫోటోతో హీరోగా పరిచయం కావడంతో పాటు తొలి హిట్‌ను కూడా అందుకున్నాడు. ఈ సినిమాలో తన నటనతో అందరిని మెప్పించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో వరుసగా ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఫ్యామిలీ డ్రామా, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో హీరోగా స్థిరపడిపోయాడు.
ఇలా హీరోగా నటిస్తూనే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేస్తూ వస్తున్నాడు. అడవి శేష్ ప్రధాన పాత్రలో వచ్చిన హిట్ 2 మూవీలో విలన్ పాత్రలో కనిపించి అందరినీ అశ్చర్యపరిచాడు. ఈ మూవీ ద్వారా కేవలం హీరో అని కాకుండా పాత్ర నచ్చితే విలన్ క్యారెక్టర్ కూడా చేస్తానని చెప్పకనే చెప్పాడు. ఆ తర్వాత సుహాస్ హీరోగా నటించిన అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్ ఇటీవల థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ తెచ్చుకుంది.
అంత లేదు లెండి
ప్రస్తుతం సుహాస్ ప్రసన్న వదనం అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం ఈ హీరో 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారన్న టాక్ నడుస్తోంది. ఈ విషయాన్ని టీజర్ లాంచ్ కార్యక్రమంలో ప్రశ్నించగా దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చాడు. ‘‘జూనియర్ ఆర్టిస్ట్‌గా 100 రూపాయలు తీసుకునే స్థాయినుంచి ఇక్కడికి వచ్చా.. నాకూ కొంత తీసుకోవాలని ఉంటుందిగా.. కాకపోతే మీరు అనుకున్నంత రేంజ్లో నేను రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని నవ్వేశాడు. మరొక రిపోర్టర్.. ఎక్కువగా మీరు కొత్త దర్శకులతో చేయడానికి కారణమేంటని అడగగా.. ఎవరైనా వారి తొలి చిత్రాన్ని ప్రేమించినంతగా తర్వాత తెరకెక్కించే వాటిని అంతగా ప్రేమించకపోవచ్చు. ఈ కారణం వల్లనే కొత్తవాళ్లతో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తానంటూ తెలిపాడు. ప్రస్తుతం టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని కెరీర్ పరంగా సుహాస్ దూసుకుపోతున్నాడు.