Sunrisers Hyderabad.. సీజన్లో భారీ స్కోర్లు చేస్తూ విధ్వంసకాండకు తెరతీసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ గత రెండు మ్యాచ్‌లుగా డౌన్ అయిపోయింది. సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో పరాజయం మరిచిపోకముందే తాజాగా చెన్నై వేదికగా సీఎస్కేతో మ్యాచ్‌లోనూ ఓటమిని చవిచూసింది. అయితే ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ రైజర్స్ చేజింగ్‌లోనే తబడడం గమనార్హం. ఈ సీజన్లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రతీ సందర్భంలోనే ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్లు నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం విఫలమవుతోంది. ప్రస్తుతం 9 మ్యాచ్‌లాడిన ఎస్ఆర్హెచ్ ఐదు విజయాలు, నాలుగు ఓటమలుతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. తర్వాతి మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు సొంతగడ్డపై ఆడనుండగా.. మరొక మ్యాచ్ మాత్రం ప్రత్యర్థి వేదికలో ఆడనుంది.
Read More: IPL Matches: పరుగుల వరద బాగానే ఉన్నా ఇంపాక్ట్ రూల్‌తో నష్టమే ఎక్కువ..
ఇక్కడ విషమేంటంటే.. ఎస్ఆర్హెచ్ మొదట బ్యాటింగ్ చేస్తే తిరుగుండదు. భారీ స్కోర్లు చేసేదాకా ఇన్నింగ్స్‌కు ఫుల్స్టాప్ పెట్టదు. అయితే చేజింగ్‌లో మాత్రం ఇదే టెంపోను కంటిన్యూ చేయలేకపోతుంది. హెడ్, అభిషేక్, మార్కరమ్, క్లాసెన్, నితీశ్, సమద్, షాబాజ్ అహ్మద్‌లతో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టుగా ఉన్న రైజర్స్ గత రెండు మ్యాచ్‌లుగా మాత్రం తేలిపోతుంది. తొలుత బ్యాటింగ్ చేస్తే విధ్వంసకర ఇన్నింగ్స్‌లు వస్తాయని భావించిన ప్రత్యర్థి జట్లు టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఏంచుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. కానీ ఎస్ఆర్హెచ్ కూడా చేజింగ్‌లో రాణించాల్సిన అవసరముంది. ఎప్పుడు తొలుత బ్యాటింగే కాదు.. ఒత్తిడిలో రెండో ఇన్నింగ్స్‌లో ఎలా ఆడాలన్నది వంట బట్టించుకోవాలి. అప్పుడే ఈ సీజన్లో సన్‌రైజర్స్‌ను చాంపియన్‌గా చూసే అవకాశం ఉంటుంది. Sunrisers Hyderabad
తొలుత ఫీల్డింగ్ చేసినప్పటికి రైజర్స్ బౌలర్లు బాగానే బౌలింగ్ చేస్తున్నారు. ప్రత్యర్థి జట్ల బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకుంటుంటే మనవాళ్లు మాత్రం పరుగులన కట్టడి చేయడంలో విజయవంతమవుతున్నారు. కమిన్స్, నటరాజన్, భువనేశ్వర్, ఉనాద్కట్, మయాంక్ మార్కండేలతో కూడిన బౌలింగ్ విభాగం పెద్దగా పరుగులు ఇవ్వడం లేదు. ఈ సీజన్లో 200 ప్లస్ స్కోర్లు సర్వ సాధారణంగా మారిపోయాయి. అయితే చేజింగ్‌లో రైజర్స్ ఒత్తిడిని తట్టుకొని నిలబడగలిగితే ఎదురన్నదే ఉండదు. రాబోయే మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి సన్‌రైజర్స్ మళ్లీ చార్జ్ అవుతుందేమో చూడాలి.
Read More: Rishabh Pant: పంత్.. ఆడుతుంది నువ్వేనా? టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక లాంఛనమే..