Tollywood: ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ నటులు, అలాగే సినిమాలపై సర్వేలు నిర్వహించడం.. వాటి ఫలితాలను వెల్లడిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రేక్షకులు మెచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్లకు సంబంధించినవి కూడా ప్రకటిస్తుంటుంది.
తాజాగా ఈ మీడియా సంస్థ 2023 గాను టాలీవుడ్(Tollywood) మూవీస్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రియుల అభిప్రాయాల ఆధారంగా ఎవరి మూవీ ఏ స్థానంలో నిలిచిందో ఓ జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో రెండే రెండు పెద్ద చిత్రాలు ఉండగా మిగిలినవన్నీ చిన్న హీరోల సినిమాలు కావడం విశేషం. ఇక టాప్ 10 సినిమాల లిస్ట్ లో ఏ హీరో మూవీ ఏ స్థానాన్ని సంపాదించుకుందో చూద్దాం..
((దీనిపై ఓ లుక్కేయండి: నిర్మాతలకు ఇలానే చెబుతా.. రెమ్యునరేషన్ పెంపు వార్తలపై అదిరిపోయే రిప్లై!))
మొదటి స్థానం ఆ మూవీదే..
ప్రముఖ దిగ్గజ సోషల్ మీడియా నెటవర్క్ ఎక్స్ వేధికగా ఈ జాబితాలను విడుదల చేసింది. అందులో ముఖ్యంగా ఒరిజినల్ తెలుగు భాషల్లో విడుదలై అందరు మెచ్చిన టాప్ 10 సినిమాల బాబితాను ప్రకటించింది ఆర్మాక్స్. ఆ సినిమాలేంటో ఓ లుక్కేస్తే.. ఇందులో మెగా మేనల్లుడు హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష మూవీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఎటువంటి హైప్ లేకుండా కేవలం మౌత్ టాక్తో కలెక్షన్లను కొల్లగొట్టడంతో పాటు సెన్సేషన్ క్రియేట్ చేసింది విరూపాక్ష సినిమా. ఇక రెండో స్థానంలో జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన బలగం చిత్రం నిలిచింది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమా గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కి, కుటుంబంలోని బంధాలను చూపించడంలో ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. దీంతో తక్కువ బడ్జెట్, ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్ల ముందుకు వచ్చిన ఈ మూవీ…అందరికీ షాక్కిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక టాప్ 3లో మ్యాడ్ మూవీ ప్లేస్ సొంతం చేసుకుంది.
సింపుల్గా ధియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం.. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. టాప్ 4లో నాచురల్ స్టార్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన హాయ్ నాన్న సినిమా నిలబడింది. ఇక టాప్ 5లో నాని-కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన దసరా సినిమా దక్కించుకుంది. గత ఏడాదిలో రెండు ఉత్తమ చిత్రాలు ప్రేక్షకులకు అందివ్వడం నానికే దక్కిందని చెప్పాలి.
6వ స్థానంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన బేబీ సినిమా నిలిచింది. టాప్ 7లో అనుష్క శెట్టి – నవీన్ పోలిశెట్టిల మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమా నిలిచింది. ఇక టాప్ 8లో పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ సలార్ మూవీ నిలబడగా.. టాప్ 9లో సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమా నిలిచింది.
ఇక టాప్ 10లో చివరిగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య నిలబడింది. ఇలా కేవలం రెండు పెద్ద సినిమాలు మాత్రమే ఇంగ్లీష్ లో ఉండగా మిగిలినవన్నీ చిన్న చిత్రాలే కావడం విశేషం.