Dirty Fellow: శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “డర్టీ ఫెలో. ఈ మూవీని రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వస్తున్న ఈ మూవీలో శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించగా జి. యస్. బాబు నిర్మిస్తున్నారు.
ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి లేటెస్ట్ లీక్.. ఫ్యాన్స్‌కి పూనకాలు గ్యారెంటీ!
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని పూర్తి చేసుకుని మే 24న గ్రాండ్ గా ధియేటర్లో రానుంది. రీసెంట్గా ఈ సంస్థ కార్యాలయంలో మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ ఈ వేడకకు హాజరై.. డర్టీ ఫెలో ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ వేడుకకు చిత్ర హీరో శాంతిచంద్ర, మూవీ డైరెక్టర్ మూర్తి సాయి అడారి, చిత్రయూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు.
ఈ మూవీ పాటలు మధుర ఆడియో ద్వారా మార్కెట్లో విడుదల అయ్యాయి.
ఈవెంట్ అనంతరం డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ మాట్లాడుతూ.. శాంతిచంద్ర హీరోగా నటించిన ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మే 24న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. చిత్ర యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు.
హీరో శాంతిచంద్ర మాట్లాడుతూ.. మా డర్టీఫెలో మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసి టిమ్ ని అభినందించిన మల్లిడి వశిష్ఠ సార్‌కి ధన్యవాదాలు. మే 24న మా చిత్రం గ్రాండ్ లెవెల్ లో విడుదల కానుంది. రీసెంట్గా మధుర ఆడియో ద్వారా మార్కెట్లోకి వచ్చిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పాటల లానే ఈ చిత్రం కూడా అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను.
ఈ మూవీ డైరెక్టర్ మూర్తి సాయి ఆడారి మాట్లాడుతూ… డర్టీ ఫెలో ట్రైలర్ ను డైరెక్టర్ వశిష్ఠ ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. మే 24న రిలీజ్ కాబోతున్న మా చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు ఉంటాయని తెలిపారు.
నటి నటులు:
శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ వాలా హిరో హీరోయిన్లుగా నటించగా సత్యప్రకాస్, నాగి నిడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులు మిగిలిన పాత్రల్లో నటించారు.
టెక్నికల్ టీం
సమర్పణ : శ్రీమతి గుడూరు భద్ర కాళీ
బ్యానర్ : రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : జి.యస్. బాబు.
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఆడారి మూర్తి సాయి
డి. ఓ. పి : రామకృష్ణ. యస్.
మ్యూజిక్: డాక్టర్. సతీష్ కుమార్.పి.
ఎడిటర్ : జేపీ
ఫైట్స్ : శంకర్
కొరియోగ్రఫీ : కపిల్ & ఈశ్వర్