Yami Gautam No Belief In Fake Film Awards: యామి గౌతమ్ అంటే ఎవరికీ గుర్తు రాకపోవచ్చు కానీ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌లో నటించిన అమ్మాయి అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు. ‘నువ్విలా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి సినిమాల్లో నటించింది. టాలీవుడ్లో కలిసి రాకపోవడంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. నార్త్‌లో అవకాశాలను అందిపుచ్చుకున్న ఈ భామ అక్కడే సెటిల్ అయ్యింది. తాజాగా ఈ అమ్మడు ఫిల్మ్ అవార్డుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
(( దీనిపై ఓ లుక్కేయండి: రూ. 100 నుంచి 3 కోట్ల రెమ్యునరేషన్.. సుహాస్ అదిరిపోయే రిప్లై!))
విన్నర్ పై ప్రశంసలు
ఇటీవల ఆర్టికల్ 370 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యామి గౌతమ్ ఈ మూవీలో తన నటనకు గాను ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఈ బీటౌన్ బ్యూటీ ‘ఫిల్మీ’ అవార్డులు నకిలీవంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కొన్నాళ్లుగా ఇండియాలో జరిగే అవార్డులకు హాజరు కాకపోవడానికి కూడా కారణం తెలిపింది. ప్రస్తుతం యామి ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ అమ్మడు అలా అనటానికి వెనకున్న కారణమేంటో తెలుసుకుందాం..
తాజాగా లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 96వ అకాడమీ అవార్డు వేడుకల్లో క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఓపెన్ హైమర్ మూవీ ఏడు అవార్డులను దక్కించుకుంది.ఈ చిత్రంలో లీడ్ రోల్లో కనిపించిన సిలియన్ మర్ఫీ బెస్ట్ యాక్టర్ విభాగంలో అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతనిపై బాలీవుడ్ భామ యామి గౌతమ్ ప్రశంసల జల్లు కురిపించింది.
గ్లోబల్ ప్లాట్‌ఫామ్ పై ఓర్పు, స్థిరత్వం మరెన్నో భావోద్వేగాలకు నిలబడే ఒక అసాధారణ నటుడిని చూస్తుంటే తనకు ఎంతో సంతోషంగా ఉందని యామి పేర్కొంది. ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలిచే ఆస్కార్ అవార్డు దక్కించుకున్నందుకు.. మీ ప్రతిభకు అది అత్యుత్తమంగా నిలుస్తుందని ఓపెన్ హైమర్ నటుడు సిలియన్ మర్ఫీని అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
అవార్డ్స్ నకిలీ(Yami Gautam No Belief In Fake Film Awards)
ఆస్కార్ విన్నర్ పై బాలీవుడ్ భామ యామి గౌతమ్ ప్రశంసలు కురిపించడంతోపాటు ఇండియన్ ఫిల్మ్ అవార్డులను తీవ్రంగా విమర్శిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ అవార్డుల ప్రహసనం అంతా నకిలీ అంటూ పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించింది. ప్రస్తుత నకిలీ ‘ఫిల్మీ’ అవార్డులపై నమ్మకం లేదని.. అందుకే గత కొన్నాళ్లుగా తాను హాజరుకావడం లేదంటూ చెప్పుకొచ్చింది. ఇలా చెబుతూనే చివరికి అసాధారణ నటుడు సిలియన్ మర్ఫీ అవార్డ్స్ సొంతం చేసుకోవడంపై తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపింది.
కొందరలా-కొందరిలా
ఇక యామి చేసినా పోస్ట్ ను చూసిన అభిమానులు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు యామికి సపోర్ట్ చేస్తూ ఆమె చెప్పినవి నిజమేనంటూ కామెంట్లు పెడుతూ మద్దతుగా నిలుస్తున్నారు. మరికొందరు ఆమె అక్కసుతోనే ఇలా పోస్ట్ చేసిందని వ్యతిరేకిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Having no belief in any of the current fake “filmy” awards, since the last few years, I stopped attending them but today i am feeling really happy for an extraordinary actor who stands for patience, resilience & so many more emotions.
Watching him being honoured on the biggest…
— Yami Gautam Dhar (@yamigautam) March 11, 2024