Yash: సినీ తారలు అనగానే స్టార్ స్టేటస్, స్టార్డమ్, అద్దాల మేడలు, రంగురంగుల ప్రపంచం అని అంత ఊహించుకుంటూ ఉంటారు. కానీ అందరిలాగే వాళ్ల జీవితాల్లో కూడా ఎన్నో కష్టసుఖాలు ఉంటాయి. నటులు నుంచి స్టార్లగా మారిన తరువాత అందరూ గుర్తుపడతారు, వాళ్లకి అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి.. కానీ అదే సక్సెస్ రాకముందు మాత్రం వాళ్లెవరూ, ఎన్ని కష్టాలు పడి అంత దూరం వచ్చారో ఎవరికీ తెలియదు. ఈ తరహాలోనే హీరో యష్ ఎన్నో కష్టాలు, మరెన్నో ఒడిదుడుకులను అధిగమించాడు. కేవలం 50 రూపాయల జీతం నుంచి 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకున్నాడు.
16 ఏళ్ల నుంచి మొదలైంది..
కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో జన్మించిన యష్ అసలు పేరు నవీన్. అతని తల్లి యశ్వంత్ అని పిలిచేది. సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత తన పేరును యష్ గా(Yash) మార్చుకున్నాడు. తన తండ్రి అరుణ్ కుమార్ గౌడ.. కర్ణాటకలో డ్రైవర్ గా పనిచేశాడు. యష్ కు చిన్నప్పటి నుండి యాక్టర్ కావాలనే కోరిక ఎక్కువగా ఉండడంతో చదువు పై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు.
((దీనిపై ఓ లుక్కేయండి: నిర్మాతలకు ఇలానే చెబుతా.. రెమ్యునరేషన్ పెంపు వార్తలపై అదిరిపోయే రిప్లై!))
తల్లిదండ్రుల ఒత్తిడితో చదువు పూర్తి చేసిన యష్ 2003లో 16 ఏళ్లకే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఇక యష్ స్టార్ చేసిన ప్రాజెక్ట్ రెండు రోజుల షూటింగ్ తర్వాత అనివార్య కారణాలతో ఆగిపోవడంతో.. తర్వాత తెరవెనుక పనిచేయడం మొదలుపెట్టాడు.
సీరియల్ లోకి అడుగు..
2004లో తొలి టెలి సీరియల్ ఉత్తరయాన్లో నటించాడు. ఆ తర్వాత గోకుల, మెల్ బిల్లు, ప్రీతి ఎలాడా మేళా వంటి పలు టీవీ సీరియల్స్ లో నటించాడు. ఇలా నటిస్తుండగానే పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రాల్లో నటించలేకపోయాడు.
((దీనిపై ఓ లుక్కేయండి: అరాచకం అంటే ఇదేనేమో.. కల్కిలో ఎన్టీఆర్ స్పెషల్ రోల్?))
సినీ పరిశ్రమలోకి ఎంట్రీ..
చివరకి ప్రియా హాసన్ జంబద హుడిగిలో సహాయ పాత్రతో యష్ సినీ రంగ ప్రవేశం చేశాడు. చివరికి హీరోగా రాకీ చిత్రం ద్వారా తన కలను నెలవేరింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయపాలైంది. తర్వాత యష్ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం మొదలసాలా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో మొదటి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
కేజీయఫ్ మూవీతో పాన్ ఇండియన్ స్టార్
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీయఫ్ మూవీతో పాన్ ఇండియన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేయడంతో పాటు.. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. దీని తరువాత వచ్చిన కేజీయఫ్ 2 కూడా వరల్డ్ వైడ్‌గా సూపర్ డూపర్ హిట్ కావడంతో మనోడి రేంజ్ ఒక్కసారిగా పెరిగింది.
ఇక బాలీవుడ్ ఆగ్ర హీరోలతో పోటీపడుతున్న ఈ స్టార్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 నుంచి రూ. 150 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్. ప్రస్తుతం కేజీయఫ్ 2 తరువాత చాలా గ్యాప్ తీసుకుని టాక్సిక్ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.