Aadhaar Card Update For Free Deadline Extended: ఆధార్ కార్డ్… ప్రభుత్వం అందిస్తున్న గుర్తింపు కార్డులలో ముఖ్యంగా మారిపోయిందనే సంగతి తెలిసిందే. ప్రజలు అందుకుంటున్న పథకాలు, బ్యాంకు ఖాతాలు లింకు ఇలా ప్రతీదానికి ఆధార్ కీలకం అయిపోయింది. అంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే ప్రభుత్వం ఈ ఆధార్‌కు సంబంధించి సేవలను మరింత మెరుగ్గా అందించేందకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఆధార్ వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసే గడువును కేంద్రం ప్రభుత్వం పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మార్చి 14, 2024 ఉన్న గడువు పొడిగించడంతో ఆధార్ కార్డ్ ఇంకా అప్డేట్ చేసుకోని ప్రజలకు కాస్త ఉపశమనం లభించిందనే చెప్పాలి.
(( దీనిపై ఓ లుక్కేయండి: సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు! ))
గుడువు పొడిగింపు
ప్రజలు తమ ఆధార్ కార్డ్ వివరాలను మార్చి 14, 2024 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని గతంలో UIDAI తెలిపిన సంగతి తెలిసిందే. ఈ తేది తర్వాత మన ఆధార్‌లో మార్పులు చేయాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం విధించిన గడువు దగ్గర పడడంతో ఆధార్ కార్డ్దారులు వారి కార్డ్‌లోని మర్పులు కోసం ఈసేవ వద్ద క్యూలు కడుతున్నారు.
కొన్ని చోట్ల సర్వర్లు సరిగా పనిచేయని కారణంగా ఆప్డేట్ కార్యక్రమం ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న గడువును జూన్ 14, 2024 వరకు UIDAI పొడిగించింది. ఇప్పటికీ ఈ గడువును పొడిగించడం ఇది రెండోసారి. ఈ క్రమంలో ప్రజలు తమ వివరాలను అప్డేట్ చేసుకుని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తనీయకుండా చూసుకోవాలని యూఐడీఏఐ కోరింది. , ప్రత్యేకించి వారి ఆధార్ కార్డ్ పాతది లేదా 10 సంవత్సరాలుగా అప్డేట్ చేయబడలేదు.
అధిక చార్జీలు వసూలు చేస్తే.. అంతే
సేవలకు సంబంధించి ఏ ఆపరేటర్ అయినా ఆధార్ కార్డ్దారులు వద్ద నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయకూడదు.. అలా చేసినట్లు తెలిస్తే సదరు ఆపరేటర్ని సస్పెండ్ చేస్తామని UIDAI ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు ఆధార్ సేవల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన, ఆపరేటర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిసినా.. వారి ఫిర్యాదులను ఈమెయిల్ ద్వారా యుఐడిఎఐకి తెలియజేయడం లేదా 1947 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి తెలపవచ్చు.
ఆధార్ అప్డేట్ ఇలా చేసుకోండి(Aadhaar Card Update)
(1) UIDAI అధికార వెబ్ సైట్లోకి వెళ్లి.. ఆధార్ టాబ్ కింద ఉన్న అప్డేట్ ఆధార్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
(2) అప్డేట్ చేసుకోవాల్సిన ఆధార్ కార్డు నెంబర్‌తో పాటు అందులో కనిపించే సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేసి ఓటిపి బటన్ పై క్లిక్ చేయాలి.
(3) మీరు గతంలో ఆధార్‌తో లింక్ చేసిన రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు… వన్ టైం పాస్ వర్డ్ వస్తుంది. ఆ నెంబర్‌ను అందులో నమోదు చేసి లాగ్ ఇన్ బటన్‌పై క్లిక్ చేయండి.
(4) అనంతరం మీరు మార్చుకోవాల్సిన అడ్రస్, ఫోన్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలను అక్కడ ఉన్న ఆప్షన్లో ఎంచుకోండి. అలానే మీ మార్పులను సపోర్ట్ ఇచ్చే డాక్యుమెంట్లతో స్కాన్ చేసి, కాపీలను అప్లోడ్ చేసి.. రివ్యూ అనంతరం సబ్ మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
(5) ఆధార్ కార్డ్ మార్పు రిక్వెస్ట్ సమర్పణ ప్రక్రియ పూర్తయ్యాక.. మీ ప్రత్యేకమైన అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ URNతో కన్ఫర్మేషన్ వస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం URN నెంబర్‌ను మీ వద్ద జాగ్రత్తగా ఉంచుకోండి.
(6) మీ ఆధార్ అప్డేట్ అభ్యర్థన ఆమోదించిన అనంతరం మీరు సవరించిన డేటాతో కొత్త ఆధార్ కార్డ్‌ని అందుకుంటారు.