Alcohol Drinking Side Effects On Body: ప్రస్తుత రోజుల్లో పార్టీ జరిగినా, ఆనందం, బాధ ఇలా కారణం ఏదైన గానీ ఆల్కహాల్ అక్కడ ఉండాల్సిందే. మరికొందరు అదో దినచర్యలా రాత్రి అయితే చాలు కడుపులోకి ఈ పానీయాన్ని పంపాల్సిందే అంటుంటారు. అయితే ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుందని గ్రహించాలి. సాధారణంగా చాలామంది మానసిక ఉల్లాసం కోసం మద్యం సేవిస్తుంటారు. ఆల్కహాల్ మితంగా తీసుకుంటే పర్లేదు.. ఎందుకంటే మెదడు ఉత్తేజితమవ్వడంతో పాటు, మన శరీరంలో ఉత్సాహం కూడా పెరుగుతుంది.
ఈ క్రమంలో శరీరంలో ఉత్పత్తయ్యే డోపమైన్, ఎండార్ఫిన్ వంటి హార్మోన్లు మెదడును ఉత్తేజపరుస్తాయి. అయితే ఇది తాత్కాలికమే అనుకోండి , కాకపోతే ఎంతో కొంత ఇది మన శరీరానికి మంచి చేస్తుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది గానీ., అదే లిక్కర్ ని మొతాదు మించి, లేదా ఎక్కువగా తాగితే శరీరంపై ప్రభావం చూపడంతో పాటు అనారోగ్యానికి దారి తీస్తుంది.
ఎంత తాగితే అంత దుష్ప్రభావం
మద్యం(Alcohol) ప్రభావం వివిధ దశలుగా ఉంటుంది. లిక్కర్‌ను ఎంత ఎక్కువగా తీసుకుంటే దుష్ప్రభావాల తీవ్రత కూడా అంతే ఉంటుంది. అతిగా మద్యాన్ని సేవిస్తుంటే దాని ప్రభావం.. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే అనారోగ్యంగా ఉన్నట్లు భావన కలుగుతుంది.
ఒక్కోసారి కొందరు ఉదయం లేవగానే తలనొప్పిగా ఉందనో లేదా శరీరం సహకరించడం లేదనో చెబుతుంటారు. అంతేకాకుండా ఈ లిక్కర్ మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో.. మన శరీరంలోని రోగ నిరోధక కణాల సంఖ్య తగ్గిపోతోంది. కొన్ని సందర్బాల్లో దీని కారణంగా మరణించే అవకాశం కూడా ఉంది.
(ఇది కూడా చదవండి: భయపెడుతున్న బెల్లీ ఫ్యాట్.. శరీరంలో కొవ్వు తగ్గాలంటే ఇవి తప్పనిసరి!)
మెదడు పై ప్రభావం
అతిగా మద్యం సేవిస్తే మెదడులో క్రియాశీలత తగ్గిపోవడంతో పాటు నాడులు దెబ్బతింటాయి. అంతేకాకుండా గుండెపై ప్రభావం చూపిస్తుంది.. ఈ క్రమంలో వారి గుండె కొట్టుకునే వేగం తగ్గే అవకాశాలు ఉన్నాయి. మద్యం శరీరంలోని రక్తనాళాలను వెడల్పు చేస్తుంది. తద్వారా ప్రతి అణువుకూ వెళ్తుంది. ఇక జీర్ణాశయంలోకి వెళ్లిన మద్యం సరిగా జీర్ణం కాదు. మద్యం శరీరంలోకి వెళ్లన తర్వాత మొదట ఎసిటాల్డిహైడ్గా విడిపోయి.. ఆ తర్వాత ఎసిటిక్ ఆమ్లంగా, చివరికి కార్బన్‌డయాక్సైడ్‌గా విడిపోతుంది. ఈ ప్రక్రియలోని జరుగుతున్న దశల్లో కొంత శక్తి కూడా విడుదల అవుతుంది. అధికంగా ఆల్కహాల్ సేవిస్తున్న వారిలో కొందరు బరువు పెరగడానికి ఇది కూడా ఒక కారణం.
బరువు పెరిగినా.. నీరసంగా అనిపిస్తుంది
మద్యం ఎక్కువగా సేవించే వారికి.. శరీరానికి కావాల్సిన శక్తి ఎక్కువగా ఆల్కహాల్ నుంచి వస్తుంది. దీని వల్లే చాలా మంది ఆహారం తక్కువ తింటారు. ఇలా జరగడం వల్ల శరీరానికి కావాల్సిన కెలరీలు మాత్రమే అందుతాయి తప్ప ఇతర పోషకాలు అందవు. దీని ప్రభావమే బరువు పెరగడం, నీరసంగా అనిపించడంతో పాటు పనుల్లో చురుగ్గా పాల్గొనలేకపోతారు. ఈ మద్యానికి బానిసగా మారితే , ఆ తర్వాత అది మనల్ని కంట్రోల్ చేస్తుందని ఇప్పటికే చాలా సార్లు నిరూపితమైంది. కనుక దీని విషయంలో జాగ్రత్త అవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.