Khushbu Sundar Comments About Animal Movie: యానిమల్ మూవీ.. రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నో వివాదాలు, విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అవేవి సినిమా విజయాన్ని ఆపలేకపోయాయి. కొన్ని అభ్యంతకర సన్నివేశాలు ఉన్నా.. ప్రేక్షకులు యానిమల్కి బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ ఇవ్వడంతో పాటు భారీ కలెక్షన్లను ఈ మూవీకి అందించారు. అంతేనా సోషల్ మీడియాలో సైతం యానిమల్ బీజీఎంలు, డ్యాన్స్‌లు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ రేంజ్లో పాపులారిటీ సంపాదించిన ఈ సినిమాని ఇంతవరకు చూడలేదని సీనియర్ నటి ఖుష్బూ చెప్పుకొచ్చారు. దానికి కారణం ఏంటంటే..
ఇలాంటి సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి
ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన నటి ఖుష్బూ ‘యానిమల్’ మూవీపై స్పందించారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. నాకు యానిమల్ తరహా సినిమాలు అసలు నచ్చవు. అందువల్లే ఇంతవరకు ఈ మూవీని చూడలేదు. నాకో విషయం అర్థం కావడం లేదు.. ఇలాంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లతో భారీ వసూళ్లు రాబడుతున్నాయి. దీని బట్టి చూస్తుంటే ప్రజల మైండ్‌సెట్ ఎలా ఉందో ఆలోచించాలి.
(( దీనిపై ఓ లుక్కేయండి:: ప్రభాస్ డూప్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎంతో తెలుసా? ))
గతంలో ఇదే తరహా మూవీ అయిన కబీర్ సింగ్ (అర్జున్ రెడ్డి) కూడా ఒక సమస్యగానే ఫీలయ్యాం. ప్రేక్షకులు ఈ తరహా సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తుండడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. యానిమల్ దర్శకుడిని నేనే తప్పుపట్టడం లేదు. ఎందుకంటే అతడు ఈ తరహా సినిమాలు చేస్తున్నప్పటికీ అందులో విజయాన్ని చూస్తున్నాడు.
నా పిల్లలు వద్దన్నారు
సాధారణంగా మన చుట్టూ సమాజంలో ఏం జరుగుతుందో సినిమాల్లో చూపిస్తాం. అలానే మనం స్త్రీల పట్ల గౌరవంగా వ్యవహరించాలని మాట్లాడుతాం.. అయినప్పటికీ, అలాంటి చిత్రాలను చూడటమే కాదు భారీ కలెక్షన్లను కూడా అందిస్తున్నాం. నా పిల్లలు ఈ సినిమా చూడాలని నేను కోరుకోను.
అయితే వారు ఈ సినిమా దేనికి సంబంధించిందో తెలుసుకోవాలని చూశారు. చూసిన వెంటనే వాళ్లు తిరిగి వచ్చి, ‘అమ్మా దయచేసి ఈ సినిమా చూడకని హెచ్చరించారని చెప్పుకొచ్చింది. అసలు ఇలాంటి చిత్రాలకు రిపీట్ ఆడియన్స్ ఉన్నప్పుడు మన సమాజం ఎటుపోతోందని ఆమె ప్రశ్నించింది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఖుష్బూ ‘అరణ్మయి 4’ సినిమాలో నటిస్తోంది.
గతంలో కూడా..
జనవరిలో జరిగిన అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో గీత రచయిత జావేద్ అక్తర్ కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. ఒక పురుషుడు స్త్రీని చెంపదెబ్బ కొట్టడం వంటి సినిమాను సూపర్ హిట్ చేయడం అంటే అది ప్రమాదకరమని వ్యాఖ్యానించాడు. వేటిని అంగీకరించాలో.. ఏది తిరస్కరించాలో ప్రేక్షకులకు తప్పనిసరిగా అవగావన ఉండాలని సూచించారు.