Tips To Reduce Belly Fat: ఆరోగ్యమే మహా భాగ్యం అనే పదం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత బిజీ బిజీ బతుకులు, కొన్ని ఫాస్ట్ పుడ్ సెంటర్లు, నగరాల్లోని కాలుష్యాలు, నాణ్యత లేని తిండి పదార్థాల వల్ల అదే ఆరోగ్యం అటకెక్కుతోంది. వీటి వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు యవ్వనంలో పెద్దగా తెలియక పోయినా 30 నుంచి 40 జర్నీ చేస్తుండగా ఒక్కొక్కటి బయటపడుతుంటాయి. వీటిలో అత్యధికంగా బాధపడే సమస్య బెల్లీ ఫ్యాట్ ( పొట్ట చూట్టు కొవ్వు చేరి లావుగా కనపించడం).
అయితే కొందరు ఈ బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించేందుకు తెగ కష్టపడుతుంటారు. మరికొందరు తాము పెద్దగా తినకపోయినా పొట్ట మాత్రం పెరుగుతుందని బాధపడుతుంటారు. యవ్వనం తర్వాత వయసు పెరిగే కొద్దీ హార్మోన్ల ప్రభావం కారణంగా మన శరీరంలోని పలు మార్పులు చోటు చేసుకుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన ఆహారం అలవాట్లపై కాస్త శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. లేదంటే కొవ్వు మన శరీరంలో క్రమంగా బరువు పెరుగుతూ అనేక అనారోగ్యాలకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
డైట్ ఫుడ్
ప్రస్తుత రోజుల్లో ప్రజలు జీతాలు పెరుగుతాయో లేదో తిండి విషయంలో అశ్రద్ధగా ఉంటే మాత్రం మన శరీరంలో కొవ్వు మాత్రం పెరుగుతూపోతుంది. అయితే కొందరు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉండగా మరికొందరు అనారోగ్యానికి చేరువై ఆసుపత్రుల చుట్టు తిరుగుతున్నారు. ముఖ్యంగా మనం తినే ఆహారం మన నడుముపై ప్రభావం చూపుతాయి. ప్రాసెస్ చేసిన పంచదార, అధిక కొవ్వు పదార్ధాలు, అయిల్ ఫుడ్, తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఒత్తిడి లేకుండా ఉండాలి
సాధరణంగా ఆర్థిక, ఉద్యోగ ,వ్యాపార కారణాల వల్ల మనం ఒత్తిడికి లోనవుతుంటాం. దీంతో ఒత్తిడితో కూడిన ఆలోచనలు మన శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి. అంతేకాకుండా ఇది పొట్టలో కొవ్వు పెరగడానికి కారణమతుంది. అందుకే మన శరీరానికి ఒత్తిడిని దూరం చేయాలంటే ..ధ్యానానికి దగ్గర కావాల్సి ఉంటుంది. ధ్యానం చేయడంతో మీకు నచ్చిన కార్యకలాపాలు చేయడం వల్ల ఒత్తిడిని మీ దరిచేరకుండా చూడవచ్చు.
వ్యాయామం
బొడ్డు కొవ్వును తగ్గించడంలో వ్యాయామం లాంటి సానుకూల ప్రభావాలను చూపేది మరొకటి లేదని స్పష్టంగా చెప్పవచ్చు. ఉదయం, సాయంత్రం కాసేపు వర్కవుట్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గడమే కాకుండా మీ శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. మీరు సైక్లింగ్, వాకింగ్, జుంబా, స్విమ్మింగ్జ.. ఇలా మీకు నచ్చిన ఏదైనా ఎంచుకోవచ్చు.
సరిపడ నిద్ర
రోజంతా పనులతో బిజీ బిజీగా సాగుతున్న జీవితానికి విశ్రాంతి అవసరం. అందుకే వైద్యులు సరిపడా నిద్ర తప్పనిసరని చెబుతారు. కొందరు రాత్రి ఎక్కువ సేపు మేల్కొవడం తక్కవ సేపు నిద్ర పోవడం చేస్తుంటారు. అలాంటి వారిలో పలు రకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తె అవకాశం ఉంది. మీరు బాగా విశ్రాంతి తీసుకున్నప్పుడు, మీ శరీర అవయవాలు సజావుగా పని చేయడంతో పాటు మీ మానసిక స్థితిని కూడా నియంత్రిస్తుంది. ఇది మీ బెల్లీ ఫ్యాట్‌ను దూరంగా ఉంచుతుంది.