IPL 2024.. మాములుగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కాసుల పంట కురిపిస్తోంది. జియో సినిమాలో స్ట్రీమింగ్‌తోనే ఐపీఎల్‌కు ఆదాయం కుప్పలుతెప్పలుగా వస్తున్నప్పటికి మరింత ఆదాయం కోసం సరికొత్త దారులు వెతుకుతుంది. ఈ నేపథ్యంలోనే లీగ్‌లో బాగా క్రేజ్ ఉన్న మ్యాచ్‌ల టికెట్ల ధరలను అమాంతం పెంచేసీ క్యాష్‌ను దోచుకునే పనిలో పడ్డారు ఐపీఎల్ నిర్వాహకులు.
ఫ్రాంచైజీ క్రికెట్ వినోదానికి కేరాఫ్..ధనాధన్ బ్యాటింగ్, మెరుపు ఫీల్డింగ్..పిచ్ అనుకూలిస్తే వికెట్ల పండుగ చేసుకొనే పేసర్లు, స్పిన్నర్లు..మొత్తం మూడు గంటల్లో ముగిసే ఫ్రాంచైజీ క్రికెట్‌పై ఫ్యాన్స్‌కు ఎక్కడలేని క్రేజ్..అందుకే అభిమానుల ఈ పిచ్చిని ఫ్రాంచైజీలు బాగా ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. ‘డైనమిక్ రేట్స్’ పేరిట ఫ్యాన్స్ జేబును గుల్ల చేస్తున్నాయి. టిక్కెట్ ధరల నిర్ణయాధికారం ఫ్రాంచైజీలకు బోర్డు వదిలేయడమే ఈ అధిక ధరలకు కారణం అని తెలుస్తోంది. IPL 2024
Read More: Glenn Maxwell: ఐపీఎల్ 2024 సీజన్ నుంచి వైదొలిగిన గ్లెన్ మ్యాక్స్‌వెల్.. కారణం ఏంటంటే?
ఇక ఐపీఎల్లో ఇప్పటికే సగం మ్యాచ్‌లు ముగిశాయి. రాజస్తాన్, కోల్‌కతా, సన్‌రైజర్స్ హైదరాబాద్, సీఎస్కేలు భారీ విజయాలతో పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో ఉండగా.. మిగిలిన అన్ని జట్లు పడుతూ లేస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఒక్క ఆర్సీబీ మాత్రమే ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు పరాజయాలతో 10వ స్థానాన్ని స్థిరంగా నిలుపుకుంటూ వస్తోంది. ఈ సాలా కప్ నమ్దే అంటూ బరిలోకి దిగిన ఆర్సీబీ ఈసారి కూడా కప్ కొట్టడం గగనమే అనిపిస్తోంది.
చదవండిః విండీస్ క్రికెటర్లు లేని ఐపీఎల్ ఉంటుందా.. వారు ఉంటేనే జోష్ కదా..