IPL Matches.. ఐపీఎల్లో పరుగుల వరద పారుతోంది. ఈ సీజన్లో 200 పరుగులు చేయడం కామన్ అయిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేయడం కొత్త కాదు కానీ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ప్రత్యర్థి జట్లు ఉఫ్ అని ఊదేస్తున్నాయి. 261, 262, 262, 266,272, 277, 287 ఇలా గతంలో ఊహించని విధంగా సీజన్లో అన్ని జట్లు విధ్వంసాలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోలకతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరులు భారీ స్కోర్లు చేయడంలో ముందంజలో ఉండగా.. ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ జట్టు చేరింది. అయితే ఐపీఎల్ ఇలా ఈజీగా 250 ప్లస్ స్కోర్లు కొట్టడంపై మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అంటే కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు.. బౌలర్లు కూడా ముఖ్యమే. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల కనీస రూల్స్ గంగలో కొట్టుకుపోయాయి. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన బ్యాటింగ్‌కు తప్ప బౌలింగ్‌కు ఏమాత్రం ఉపయోగపడడం లేదని ఈ సీజన్‌తో స్పష్టమవుతోంది.
Read More: Rishabh Pant: పంత్.. ఆడుతుంది నువ్వేనా? టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక లాంఛనమే..
పరుగుల పండగ చేసుకోవాలని మాములుగానే ఐపీఎల్లో ఫ్లాట్ పిచ్‌లను తయారు చేస్తుంటారు. దీనికి అదనంగా ఇంపాక్ట్ అని పిచ్చి రూల్ తెచ్చి బౌలర్లను బలి చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ ఇంపాక్ట్ రూల్ వల్ల ఐపీఎల్లో ఆల్‌రౌండర్లు తగ్గిపోతున్నారని.. వాళ్ల చేత బౌలింగ్ చేయించడమే గగనమైపోయిందని వాపోయారు. క్రికెట్లో ఆల్‌రౌండర్ పాత్ర తప్పనిసరి. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌కు సమ న్యాయం చేస్తూ మ్యాచ్ విజయాల్లో ఆల్‌రౌండర్లు కీలకపాత్ర పోషిస్తుంటారు. అటువంటి ఆల్రౌండర్లకు ఈ సీజన్లో ప్రాధాన్యత లేకుండా పోయింది. అక్షర్ పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్యా లాంటి ఆల్రౌండర్లను ఈ సీజన్లో పూర్తిగా వాడుకోలేకపోతున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ నచ్చలేదంటూ బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్షర్ పటేల్ కూడా తాజాగా ఇంపాక్ట్‌తో ఆల్‌రౌండర్ల భవిష్యత్తుకు ప్రమాదం పొంచి ఉందని తెలిపాడు.
ఈ విషయంపై టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. బౌండరీ లైన్స్‌ను మరో రెండు, మూడు మీటర్లు వెనక్కి జరిపినా నష్టం లేదని, మరీ దగ్గరగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఫ్లాట్ పిచ్‌లు, బౌండరీ లైన్ దగ్గరగా ఉండటం, ఇంప్యాక్ట్ ప్లేయర్ రూల్.. వీటి వల్లే ఇంత భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయని క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు.
Read More: Heinrich Klaasen: సిక్సర్ల క్లాసెన్‌కు గురువులు ఎవరో తెలుసా?