Urvashi Rautela: ప్రస్తుతం యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ దేవర, వార్ -2 సినిమాలతో బిజి బిజీగా వున్న సంగతి తెలిసిందే. వార్-2 తో తారక్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుండడంతో ఈ సినిమా కోసం అభిమానులతో పాటు నార్త్ ఆడియెన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ ముంబైలో ల్యాండ్ అయిన ఫోటోలు, వీడియోలు రెండు రోజుల క్రితం తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా బాలీవుడ్ భామ ఊర్వసి రౌతేలా తన ఇన్స్ట్ లో ఓ పోస్ట్ పెట్టింది. జూనియర్ ఎన్టీఆర్ తో తాను దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తన మనసులో మాట బయటపెటింది. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఫొటోని తెగ షేర్ చేస్తూన్నారు. ఈ ఫోటోతో రక రకాల డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి కూడా. ఇంతకీ ఏంటా మ్యాటర్? ఇప్పుడు చూద్దాం..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ వైపు మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తూనే మరో వైపు వార్ -2 షూటింగ్ లో కూడా పాల్గొంటూ బిజీగా వుంటున్న విషయం తెలిసిందే. దేవరతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ తో చేయబోతున్న ఈ సినిమాను భారీగా ప్లాన్ చేశాడు డైరెక్టర్ కొరటాల శివ.
బాలీవుడ్ ఎంట్రీ పై హైప్
వార్ -2 తో తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండడంతో ఈ చిత్రానికి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ కోసం తారక్ 30 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఈ విషయం పక్కన పెడితే…షూటింగ్ కోసం తారక్ ముంబైలో ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీ టౌన్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela) ఎన్టీఆర్ తో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఎన్టీఆర్ తో ఊర్వసి సెల్ఫీ.. వైరల్
తారక్ తో సెల్ఫీ దిగిన ఊర్వశి తన పోస్టులో ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ.. మా ప్రియమైన నిజమైన గ్లోబల్ స్టార్ మీరే అంటూ రాసుకొచ్చింది. క్రమశిక్షణ, నిజాయితీ, వినయపూర్వకంగా ఉండే వ్యక్తిత్వం చాలా గ్రేట్. నాకు మోటివేషన్ ఇచ్చినందుకు థాంక్యూ. మిమ్మల్ని పర్సనల్ గా చాలా ఆరాధిస్తాను. మీతో కలిసి వర్క్ చేయడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని పోస్ట్ చేసింది.
ఊర్వసి చేసిన పోస్ట్ చూసినా పలువురు ఎన్టీఆర్ దేవర సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించునుందా అంటూ పలు అనుమానాలు లేవనెత్తారు. మరోవైపు వార్-2 లో ఊర్వసి ఓ కీలక పాత్ర పోషిస్తుందేమో అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఎన్టీఆర్ లుక్స్ అదిరిపోయాయంటూ తెగ మురిసిపోతున్నారు. మరికొందరు దేవరలో స్పెషల్ సాంగ్ తో ఈ అమ్మడు తారక్ తో కలిసి స్టెప్పులేస్తే వేరే లెవెల్ ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఏదేమైనా ఈ కామెంట్స్ లో ఏది నిజం అన్నది తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.. కాగా ఈ భామ గతంలో వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో టాలీవుడ్ ప్రేక్షకులని అలరించిన సంగతి తెలిసిందే.
View this post on Instagram